శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జలాశయం ఇన్ ఫ్లో 42,369 క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 40,259 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 854.60 అడుగులు ఉంది. జలాశయం 90.77 టీఎసీల నీటి నిల్వ ఉంది.
జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 24 వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 28 వేల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 318.290 మీటర్లు కాగా.. పూర్తి నీటి మట్టం 318.516 మీటర్లు ఉంది. జూరాల జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 9.193 టీఎంసీలుగా ఉంది.
ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'