ETV Bharat / state

తుంగభద్ర పుష్కరాలు.. ప్రసాదాల కొనుగోలుకి భక్తుల ఆసక్తి - జోగులాంబ గద్వాల్​ జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు

రాష్ట్రంలో తుంగభద్ర పుష్కరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో పుష్కర స్నానాల కోసం ఏర్పాటు చేసిన ఘాట్లలో భక్తులు పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. అనంతరం అమ్మవారి దర్శనానికి బారులు తీరుతున్నారు. ఆలయంలో దైవ దర్శనం తర్వాత ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది ప్రసాదాలు. వీటి కోసం దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ప్రసాదాల కొరత రాకుండా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

prasadam for devotees in thungabhadra pushkar
వైభవంగా తుంగభద్ర పుష్కరాలు.. ప్రసాదాల కొనుగోలుకి భక్తుల ఆసక్తి
author img

By

Published : Nov 23, 2020, 1:28 PM IST

రాష్ట్రంలో తుంగభద్ర పుష్కరాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో పుణ్య స్నానాల కోసం నాలుగు పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా 5వ శక్తి పీఠం అలంపూర్​లోని జోగులాంబ అమ్మవారి సమీపంలో పుష్కర ఘాట్​ను ఏర్పాటు చేశారు. ఇక్కడికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

అనంతరం స్వామి, అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ అధికారులు.. ఆలయం వద్ద ప్రసాదాలను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రసాదాల తయారీ కోసం ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదాలను తాజాగా తయారు చేసి అందుబాటులో ఉంచుతున్నారు. ప్రసాదాలలో అతి ముఖ్యమైన లడ్డూ, పులిహోర ప్రసాదాలను తయారు చేస్తున్నారు.

అధిక సంఖ్యలో విక్రయాలు

పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు లడ్డూ ప్రసాదం 30 వేలకు పైగా అమ్ముడుపోయింది. పులిహోర 13 వేలకు పైగా అమ్ముడుపోయింది. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని లడ్డూ తయారీ కేంద్రంలో సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రసాదాన్ని తయారుచేస్తున్నారు.

thungabhadra pushkar
లడ్డూ ప్రసాదం తయారీ

తాజాగా పులిహోర తయారీ

ఆలయ సమీపంలోని ప్రధాన కూడళ్లలో ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, సహకార బ్యాంకు ఆధ్వర్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు కౌంటర్లు ఏర్పాటు చేశారు. నిర్ణయించిన ధరలకు ప్రసాదాలని విక్రయిస్తున్నారు.

80 గ్రాముల లడ్డూ, 200 గ్రాముల పులిహోర ప్యాకెట్లను రూ. 10 చొప్పున విక్రయిస్తున్నారు. పుష్కరాల నేపథ్యంలో ప్రసాదాల కొరత ఏర్పడకుండా ముందస్తుగా 80 వేల వరకు లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి సిద్ధంగా ఉంచారు. పులిహోర ప్రసాదం మాత్రం ఎప్పటికప్పుడు తయారు చేసి విక్రయిస్తున్నారు.

ఇదీ చదవండి: వేములవాడ రాజన్న సన్నిధిలో శివయ్యకు కార్తిక పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.