జోగులాంబ గద్వాల జిల్లాలోని గోన్పాడు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న క్యాట్ ఫిష్‌ను పోలీసులు పట్టుకున్నారు. గద్వాల నుంచి రాయచూర్‌కు తీసుకెళ్తున్న సుమారు 200 కేజీల క్యాట్ ఫిష్‌లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
ఫిషరీస్ అధికారులు క్యాట్ ఫిష్ అని నిర్ధారించిన తర్వాతే కేసు నమోదు చేశామని గద్వాల గ్రామీణ ఎస్సై అరుణ్ కుమార్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై వివరించారు.
ఇదీ చూడండి : వైభవంగా లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం