జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో కరోనా బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెెడ్డి దృష్టికి వెళ్లడంతో.. దాతల సహకారంతో ఆయన 10 ఆక్సిజన్ సిలిండర్లను ఆస్పత్రికి అందించారు.
అనంతరం కొవిడ్ వార్డుల్లో తిరిగి రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆస్పత్రిలో రోగులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఆస్పత్రికి ఎప్పుడు ఆక్సిజన్ అవసరమున్నా దాతల సహకారంతో అందిస్తామని చెప్పారు. సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని చెప్పారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మందులు, పడకలు, పీపీఈ కిట్లు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అన్ని వేళలా అందుబాటులో ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: రాజధాని చెరువుల్లో కరోనా .. శాస్త్రవేత్తల నిర్ధరణ.!