ETV Bharat / state

'ఉమ్మడి మహబూబ్​నగర్​లో కొత్తకేసులు లేవు' - corona cases updates

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా కరోనా వైరస్ కేసులేమీ నమోదు కాలేదు. జోగులాంబ గద్వాల జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 15 రోజులకు పైగా కొత్తకేసులు నమోదు కాలేదు.

no-cases-registered-in-unoin-mahabubnagar
'ఉమ్మడి మహబూబ్​నగర్​లో కొత్తకేసులు లేవు'
author img

By

Published : Apr 26, 2020, 7:17 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ఆదివారం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులేమీ నమోదు కాలేదు. జోగులాంబ గద్వాల జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 15 రోజులకు పైగా కొత్తకేసులు నమోదు కాకపోవడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 45 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా.. 10 మంది కోలుకున్నారు. 45 కేసుల్లో గద్వాల 31, అయిజ 6, రాజోలిలో 4, వడ్డేపల్లిలో 2, ఇటిక్యాల, అలంపూర్ మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. 570 నమూనాలు పరీక్షలకు పంపగా ఇప్పటి వరకూ.. 528 మందికి కరోనా లేదని తేలింది. ఒకరి ఫలితం రావాల్సి ఉంది. 1, 244 మంది హోం క్వారంటైన్​లో కొనసాగుతున్నారు.

కంటైన్​మెంట్ జోన్ల ఎత్తివేత..

ప్రభుత్వ క్వారంటైన్​లో ఉన్న వారందరినీ.. హోం క్వారంటైన్​కు తరలించారు. పాజిటివ్ కేసులు నమోదైన 14 ప్రాంతాలను కంటైన్​మెంట్ జోన్లుగా గుర్తించారు. వీటిలో గద్వాలలో 8 జోన్లు ఉండగా.. అయిజలో 2, రాజోలి, ఇటిక్యాల, అలంపూర్, వడ్డేపల్లి ప్రాంతాల్లో ఒక్కో జోన్ ఉన్నాయి. మహబూబ్​నగర్ జిల్లాలో 11 కేసులు నమోదు కాగా 9 మంది డిశ్చార్జయ్యారు. ఇద్దరు గాంధీలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ నమూనాలు పంపిన అన్ని ఫలితాలు నెగటివ్ వచ్చాయి. ఒక్కొక్కటిగా కంటైన్​మెంట్ జోన్లను ఎత్తేస్తున్నారు.

కేసుల్లేవు..

నాగర్​కర్నూల్ జిల్లాలో 2 కేసులు నమోదు వారు కోలుకున్నారు. ఫలితంగా జిల్లాలోని రెడ్ జోన్లను ఎత్తివేసి జిల్లా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కొల్లాపూర్, మున్ననూరు సహా అంతరాష్ట్ర సరిహద్దుల్లో చెక్​పోస్టులతో పాటు.. అంతర్జిల్లా సరిహద్దుల్లో నిఘా మరింత పెంచారు. నారాయణపేట జిల్లాలోనూ.. కొత్త కేసులు లేవు. ఇప్పటి వరకూ నమూనాలు పంపిన ఫలితాలన్నీ.. నెగటివ్ వచ్చాయి. 17 మంది క్వారంటైన్​లో ఉన్నారు. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క కేసుకూడా నమోదు కాలేదు.

ఇదీ చూడండి: ఐదు దశల్లో లాక్​డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.