ETV Bharat / state

గద్వాలలో నిజామాబాద్​ రేంజ్​ ఐజీ పర్యటన - గద్వాలలో ఐజీ పర్యటన

జోగులాంబ గద్వాల జిల్లాలో నిజామాబాద్ రేంజ్ ఐజీ... ఎన్​.శివ శంకర్​ రెడ్డి పర్యటించారు. లాక్​డౌన్​ అమలు తీరు పర్యవేక్షించారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా సిబ్బంది భద్రత, చెక్​పోస్ట్​ల ఏర్పాటు తదితర అంశాలపై పోలీసు అధికారులతో సమీక్షించారు.

jogulamba gadwala latest news
గద్వాలలో నిజామాబాద్​ రేంజ్​ ఐజీ పర్యటన
author img

By

Published : Apr 21, 2020, 5:38 AM IST

గద్వాల జిల్లాలో కరోనా కట్టడి చర్యలో భాగంగా అమలవుతున్న లాక్​డౌన్​ పరిస్థితులను నిజామాబాద్​ రేంజ్​ ఐజీ ఎన్​.శివశంకర్​ రెడ్డి పరిశీలించారు. విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలు, చెక్​పోస్ట్​ల ఏర్పాటు, కంటైన్మెంట్​, క్వారంటైన్​ జోన్లలో చేపట్టిన చర్యలు తదితర అంశాలపై జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు.

గద్వాలలోని కంటైన్మెంట్ జోన్​ ప్రాంతాలైన రాధాకృష్ణనగర్, ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లాక్​డౌన్​ పటిష్ఠంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ కె. అపూర్వ రావు, అదనపు ఎస్పీ కె.కృష్ణ తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి : మిస్​ కాల్​ ఇస్తే చాలు.. ఇంటి వద్దకే పండ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.