ETV Bharat / state

ఆగిపోయిన నెట్టెంపాడు పనులు.. ఆందోళనలో రైతులు!

author img

By

Published : Sep 13, 2020, 8:24 AM IST

Updated : Sep 13, 2020, 9:37 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు ప్రాజెక్టులో కాలువ పనులు ఇంకా పూర్తి కాకపోవడం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లుగా కొనసాగుతున్న 99 ప్యాకేజీ పనులు కరోనా వల్ల పూర్తిగా నిలిచిపోయాయి. వచ్చే వేసవికల్లా పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నా.. కాలువ పనులు నేటికీ పూర్తి కాకపోవడం వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రాజెక్టులో నీళ్లున్నాయి. పంపులు నీటిని పంపింగ్ చేస్తున్నాయి. కానీ కాలువలకు నీళ్లు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Negligence in Nettempadu project Construction Works In Jogulamba Gadwal District
ఆగిపోయిన నెట్టెంపాడు పనులు.. ఆందోళనలో రైతులు!

జోగులాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు జలాశయం కింద నిర్మించిన గూడెందొడ్డి రిజర్వాయర్ ఎడమ కాల్వ 99 ప్యాకేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. పనులు పూర్తికాకపోవడం, ఆయకట్టుకు నీళ్లు అందించకపోవడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడెందొడ్డి రిజర్వాయర్ పూర్తయింది. కానీ కాలువ పనులు పూర్తి కాకపోవడం వల్ల రిజర్వాయర్​లో నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. కాలువ పనులు పూర్తి చేయకుండా.. మూడేళ్లుగా నాన్చుతున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి కాలువ పనులు పూర్తయితే.. 57 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. ప్రాజెక్టుల పనుల ప్రగతిపై సమీక్ష చేసే ప్రజా ప్రతినిధులు, అధికారులు సమస్యను గుర్తించి పరిష్కరించడంలో సఫలీకృతులు కావడం లేదు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నీళ్లు వస్తాయని, పొలాలకు నీటిని అందించి పంటలు పండించుకోవాలని చూస్తున్న గద్వాల, ధరూరు, ఇటిక్యాల మండలాలలోని రైతులకు ఏటా నిట్టూర్పే మిగులుతోంది. ఇప్పుడు వచ్చే వేసవిలో పనులు పూర్తిచేసి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని అధికారులు చెప్తున్నా.. రైతులు నమ్మే పరిస్థితిలో లేరు.

ఎప్పుడు పూర్తి చేస్తారో?

కృష్ణా జలాల ఎత్తిపోతల ద్వారా గద్వాల జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం చేపట్టారు. అందులో భాగంగా ఏడు జలాశయాలను నిర్మించారు. అందులోనే ఒకటైన గూడెందొడ్డి జలాశయాన్ని 2012లో పూర్తి చేశారు. నీటి విడుదల అవసరమైన గేట్ల నిర్మాణం గత ఏడాది పూర్తి చేశారు. దాదాపు రూ.56 కోట్ల వ్యయంతో గూడెందొడ్డి జలాశయం పూర్తి కాగా, జలాశయం నుంచి ఎడమ కాలువ ద్వార ఆరు వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా నిర్మాణం చేశారు. కుడి ప్రధాన కాలువ ద్వారా 57 వేల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. ప్రధాన కాలువ పరిధిలో 99వ ప్యాకేజిలో పనులు పూర్తయితేనే.. 100 ప్యాకేజీ పరిధిలో ఉన్న ఆయకట్టుకు సాగునీరందించడం సాధ్యమవుతుంది. అయితే.. 99వ ప్యాకేజీ పనులు గత మూడేళ్ల క్రితం పాత కాంట్రాక్టరును తొలగించి కొత్తగా మరొకరికి అప్పగించారు. పనులు వేగం పుంజుకునే సమయంలో నిధుల విడుదలలో జాప్యం ,బకాయిలు పెరగడం వల్ల పనుల్లో వేగం మందగించి చివరకు నిర్మాణ పనులే నిలిచిపోయాయి. గతేడాది బకాయిలను చెల్లించి పనులు చేయాలని అధికారులు గుత్తేదారులను పురమాయించారు. అదే సమయానికి కరోనా, లాక్​డౌన్​ రావడం వల్ల పనులు ప్రారంభం కాకుండానే నిలిచిపోయాయి. వేసవి ముగిసింది. ఇప్పుడు వచ్చే వేసవిలో పనులు పూర్తి చేస్తామంటున్నారు.

మళ్లీ వలస బాటేనా?

రూ.56 కోట్లతో నిర్మాణమైన గూడెందొడ్డి జలాశయం ఆయకట్టు లక్ష్యం 63 వేల ఎకరాలకు సాగునీరందించడం. ఎడమ కాలువ పరిధిలో కేవలం 6 వేల ఎకరాలకే నీరందుతుంది. గూడెందొడ్డి జలాశయం నీటినిల్వ సామర్థ్యం 1.19 టీఎంసీలు. 99 ప్యాకేజీ కింద 44 కిలోమీటర్లు, 27 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ప్యాకేజీ 100 క్రింద 40 కిలోమీటర్లు, 36 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. మొత్తం 84 కి.మీ, 63,000 ఎకరాల ఆయకట్టు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ.. కాలువ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఇంకా వర్షం మీదే ఆధార పడాల్సి వస్తుందని రైతులు ఆవేదవ వ్యక్తం చేస్తున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కడుతున్నారని.. ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వలస వెళ్లిన రైతులు తిరిగి స్వగ్రామాలకు వచ్చారు. కానీ.. ప్రాజెక్ట్ పూర్తి కాక.. కాలువలు నిర్మాణం కాక.. వర్షాలు కూడా పడకపోతే.. మళ్లీ వలస వెళ్లాల్సిందే అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే కాలువ పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని కోరుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం గతంలో పనుల నిర్మాణంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం అన్ని సమస్యలు తొలగిపోయి వేసవిలోనే పూర్తి చేయాలని నిర్ణయించాం. అదే సమయంలో కరోనా రావడం వల్ల పనులు చేపట్టలేకపోయాం. వచ్చే వేసవి కల్లా పనులన్నీ పూర్తి చేస్తామని నెట్టెంపాడు ప్రాజెక్టు ఈఈ రహీముద్దీన్​ తెలిపారు.

ఇవీచూడండి: ఇద్దరు దొంగలు అరెస్ట్​... తొమ్మిది బైక్​లు స్వాధీనం..

Last Updated : Sep 13, 2020, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.