జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ పట్టణంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ... తహసీల్దార్ మదన్మోహన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విలువైన ఓటు హక్కును యువత ఉపయోగించుకుని... భావి భారత నిర్మాణానికి కృషి చేయాలని తహసీల్దార్ కోరారు.
18ఏళ్లు నిండి... ఓటరు కార్డు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని మదన్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మన భవిష్యత్‌ను మనమే నిర్మించుకుందాం: కేటీఆర్