జోగులాంబ జిల్లాలోని గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి... వ్యవసాయ మార్కెట్ అధికారులపై మండిపడ్డారు.
ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులకు సీసీఐ కొనుగోలు కేంద్రాలను అప్పజెప్పడం.. దొంగ చేతులకు తాళాలు ఇవ్వడమేనని ఎమ్మెల్యే అన్నారు. పబ్లిసిటీ కోసమే ఎమ్మెల్యేలను పిలవడం ఏమిటని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అక్రమాలకు తావు లేకుండా కొనుగోలు కేంద్రం నిర్వహించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
ఇదీ చదవండిః తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి