ETV Bharat / state

'రైతులు ఆధైర్యపడొద్దు... ప్రభుత్వపరంగా ఆదుకుంటాం' - rain effect

జోగులాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్​రెడ్డి పర్యటించారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నీట మునిగిన పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులు అధైర్య పడొద్దని.. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

mla bandla krishnamohan reddy visited crops in gadwal

author img

By

Published : Jul 29, 2020, 4:06 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన పంటలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్​రెడ్డి పరిశీలించారు. నియోజకవర్గంలోని మల్దకల్, ధరూర్, కేటీ దొడ్డి మండలంలోని సోంపురం, చింతరేవుల, పాతపాలెం తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. భారీ వర్షాలు కురవటం వల్ల వరి, పత్తి పంటలు పూర్తిగా నీట మునిగాయని తెలిపారు.

ప్రస్తుత తరుణంలో భారీవర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లడం బాధాకరమ‌ని.. నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామ‌ని ఎమ్మెల్యే తెలిపారు. నీట మునిగిన పంటలను సర్వే చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట ధరూర్ ఎంపీపీ నజూమున్నీ బేగం, జడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్​పైనే ఆశలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.