సీఎం కేసీఆర్ నిరంతర శ్రమతో ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరత ఉండటం లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని కొవిడ్ వార్డును మున్సిపల్ ఛైర్మన్ బీఎస్ కేశవ్‌తో కలిసి పరిశీలించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ సదుపాయంతో 60 పడకలు సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు.
ఏపీకి చెందిన కరోనా బాధితులు కూడా ఇక్కడ చికిత్స పొందుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఆస్పత్రిలో కరోనా రోగులకు ఏ సమస్య రాకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: ఎల్లూరు పంపు హౌస్ మూడో మోటారు మరమ్మతులు ప్రారంభం