జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ పట్టణంలోని అక్బర్పేట రోడ్డుకు మోక్షం కలిగింది. పురపాలిక ఛైర్పర్సన్ మనోరమతో కలిసి ఎమ్మెల్యే అబ్రహం భూమి పూజ చేశారు. రూ.60లక్షలతో నిర్మించనున్నట్లు తెలిపారు.
పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు.
ఇదీ చదవండి: కొవిడ్ మహమ్మారిని జయించిన పదినెలల చిన్నారి