జోగులాంబ గద్వాల జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ముందుగా ఇటిక్యాల మండలం గోపాల్ దిన్నె గ్రామంలో మంత్రి పర్యటించారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, జిల్లా కలెక్టర్ శ్రుతి ఓజాతో కలసి పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఎకరా స్థలంలో త్వరితగతిన ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసిన అలంపూర్ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రాందేవ్ రెడ్డిని మంత్రి అభినందించారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మహిళలకు పండుగ కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజ్లో ఎమ్మెల్యే అబ్రహం అధ్యక్షతన ఏర్పాటు చేసిన అలంపూర్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమంపై కార్యకర్తలకు, నాయకులకు తగు సూచనలు చేశారు.