జోగులాంబ గద్వాల జిల్లాలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. పురపాలక ఎన్నికల్లో భాగంగా ప్రచార నిమిత్తం అలంపూర్‌కు వచ్చిన ఆయన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి వచ్చారు.
స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, స్థానిక ఎమ్మెల్యే వి.ఎం అబ్రహం, జడ్పీ ఛైర్ పర్సన్ సరిత తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో నిలిచిన మెట్రో రైలు