ETV Bharat / state

జూరాల నుంచి శ్రీశైలం వైపు పరుగెడుతున్న కృష్ణమ్మ

కృష్ణమ్మ జూరాల నుంచి శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడం వల్ల స్పిల్ వే గేట్ల ద్వారా సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం వైపు పరుగెడుతున్న కృష్ణమ్మ
author img

By

Published : Jul 31, 2019, 11:00 AM IST

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ.. శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడం వల్ల స్పిల్ వే గేట్ల ద్వారా సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి జలాశయం నుంచి నారాయణపూర్ జలాశయానికి రెండు లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. అక్కడి నుంచి లక్షా 85 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం లక్షా 50 వేల క్యూసెక్కుల నీరు జూరాలకు చేరుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 1,054 అడుగులు కాగా... ప్రస్తుతం 1,044 అడుగుల నీటిమట్టం ఉంది.

జూరాల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.275 టీఎంసీల నీరు నిల్వ ఉంది. స్పిల్ వే గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కులు... పవర్ హౌస్ ద్వారా 21 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల అవుతున్నాయి. నెట్టెంపాడు, భీమా, కోయిల్​సాగర్, ఎత్తిపోతల పథకాలకు నీరు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ సమాంతర కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది. మొత్తం లక్షా ఇరవై వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. ఇదే ప్రవాహం మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

శ్రీశైలం వైపు పరుగెడుతున్న కృష్ణమ్మ

ఇవీ చూడండి : పలకాబలపం పట్టేస్తా... ఆడుతుపాడుతు తిరిగేస్తా..

Intro:tg_mbnr_02_31_jurala_update_avb_ts10049
మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలలో కురిసిన వర్షాలకు , ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుండి జూరాలకు భారీగా వరద నీరు చేరింది దీంతో జూరాల నిండుకుండలను తలపించడంతో దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు ఒక లక్ష 19 వేల 960 క్యూసెక్కుల నీరు దిగువ శ్రీశైలం కు వెళుతున్నారు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని జూరాల జలాశయానికి గత రెండు రోజుల నుండి భారీగా వరద చేకూరడంతో జూరాల నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువన ఉన్న నారాయణపూర్ జలాశయం నుండి ఒక లక్ష 50 వేల క్యూసెక్కులు వరద నీరు జూరాల జలాశయం లోకి వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు నుండి దిగువ శ్రీశైలం కు ఒక లక్ష 19 వేలు 960 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం318.33 మీటర్లు నమోదు అయింది. జూరాల లో పూర్తిస్థాయి నీటి నిలువ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం5.568 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జల విద్యుత్ నుండి 21 వేల అ క్యూసెక్కుల దిగువకు వదులుతున్నారు. జూరాల నుండి 14 గేట్లు ఓపెన్ చేసి 90 8960 కుశ కుల నీరు దిగువకు వదులుతున్నారు. జూరాల కింద ఉన్న ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు.
byte: శివప్ప a.e జూరాల అధికారి

Body:babanna

Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.