ETV Bharat / state

జూరాలకు కృష్ణమ్మ వడివడి పరుగులు

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాజెక్టును సందర్శించి ఎడమ కాలువ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశారు.

author img

By

Published : Jul 30, 2019, 5:47 PM IST

జూరాలకు కృష్ణమ్మ వడివడి పరుగులు

ఎగువ ప్రాంతాల నుంచి జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి సుమారు 85 వేల క్యూసెక్కుల నీరు జూరాలకు వచ్చిందని అధికారులు వెల్లడించారు. జూరాలకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాజెక్టును సందర్శించారు. ఎడమ కాలువ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు. అంతకంటే ముందు కుడి కాలువకు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి సాగునీరు విడుదల చేశారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 9.6 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 2.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాలకు నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జూరాలకు కృష్ణమ్మ వడివడి పరుగులు

ఇవీచూడండి: మహారాష్ట్రలోనూ భాజపా 'ఆపరేషన్​ ఆకర్ష్'​!

Tg_mbnr_05_30_jurala_update_avb_306847 రిపోర్టర్ స్వామి కిరణ్ కెమెరామెన్ శ్రీనివాస్ ఎగువ ప్రాంతాల నుంచి జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి సుమారు 85 వేల క్యూసెక్కుల నీరు జూరాలకు వస్తుందని అధికారులు వెల్లడించారు. జూరాలకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రాజెక్టును పరిశీలించేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ జూరాలకు చేరుకున్నారు. ఎడమ కాలువ ఆయకట్టుకు ఆయన సాగునీరు విడుదల చేశారు. అంతకంటే ముందు జూరాల కుడి కాలువకు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్రెడ్డి సాగునీరు విడుదల చేశారు. నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలను సైతం ఇవాళ ప్రారంభించనున్నారు. మరోవైపు నారాయణపూర్ జలాశయం నుంచి సుమారు లక్షా 20 వేల క్యూసెక్కుల నీరు కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ నీరంత ఈ రోజు సాయంత్రానికి జూరాలకు చేరనుంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతుండడంతో మరో రెండు మూడు రోజుల్లో జూరాల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుందని సీఈ ఖగేందర్ వెల్లడించారు. ఇదే స్థాయిలో వరద ఉంటే శ్రీశైలం జలాశయానికి సైతం నీరు విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాలకు నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.