ETV Bharat / state

2 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే - జోగులాంబ గద్వాల జిల్లా తాజా వార్తలు

గతంలో ఆడపిల్ల పుట్టిందంటే పలువురు తల్లిదండ్రులు బరువుగా భావించేవారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత ఆడపిల్లలు తల్లిదండ్రులు ఆనందంగా ఉంటున్నారని ఆయన అన్నారు. గద్వాల జిల్లాలోని పలు మండలాల్లో 211 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

Kalyana Lakshmi checks distributed, MLA krishna mohan reddy
2 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Mar 28, 2021, 4:30 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్, గట్టు మండలాల్లో 211 మంది లబ్ధిదారులకు 2,11,24,476 రూపాయల చెక్కులను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి అందజేశారు. గతంలో ఆడపిల్ల పుట్టిందంటే బరువుగా భావించే పలువురు తల్లిదండ్రులకు.. కల్యాణ లక్ష్మి ద్వారా సాయం అందుతుందని అన్నారు.

పేదింటి ఆడపడుచులకు లక్షా 116 రూపాయలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు, వృద్ధాప్య పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటుతో సహా అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు.

ఇదీ చూడండి : ఉచిత నేత్ర వైద్య శిబిరాన్నిప్రారంభించిన మంత్రి తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.