జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకోనుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టులు నిండటం వల్ల అధికారులు నీటిని దిగువకు వదలనున్నారు. ఇవాళ రాత్రి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 86వేల 243క్యూసెక్కుల వరద ప్రవాహం రానుంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.66 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 1.99 టీఎంసీలు ఉన్నాయి. తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరద నీరు పోటెత్తుతోంది.
ఇవీచూడండి: విశ్వాస పరీక్షలో యడియూరప్ప విజయం