జోగులాంబ గద్వాల జిల్లాలో పియదర్శిని జూరాల ప్రాజెక్టులోకి ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్ నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్కల నీరు వచ్చి చేరుతోంది. జూరాలకు స్థిరంగా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 318.340 మీటర్లు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకి ఇన్ఫ్లో 2 లక్షల 22 వేల క్యూసెక్కులు ఉండగా... దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షలా 18,723 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇవీచూడండి: జూరాల ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లు