జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నందున... కలెక్టర్ శృతి ఓజా అధికారులతో కలిసి పట్టణంలో పర్యటిచారు. బాధితుల ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో కేసులు పెరగడానికి గల కారణాలు వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
వైరస్ వ్యాప్తి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కరోనా కట్టడి అన్ని చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. పట్టణంలో ఇప్పటి వరకు 160కేసులు నమోదైనట్లు అధికారులు వివరించారు. ఐసోలేషన్ వార్డ్‌లో ఎటువంటి సౌకర్యాలు లేవని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ వెంట ఎస్పీ రజత్ కుమార్, డీఎంహెచ్ఓ చందు నాయక్, ఆర్డీవో రాములు తదితరులు పాల్గొన్నారు.