ETV Bharat / state

ఎస్పీ పెద్ద మనసు.. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి సాయం - తెలంగాణ వార్తలు

కరోనా ఆపత్కాలంలో పోలీసులు లాక్​డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తూనే.. కారుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. లాక్​డౌన్ వేళ పురిటి నొప్పులతో కాలినడకన వెళ్తున్న గర్భిణీకి సాయం చేసి జోగులాంబ గద్వాల ఎస్పీ పెద్ద మనసు చాటుకున్నారు. పోలీసు వాహనంలో సకాలంలో గర్భిణీని ఆస్పత్రికి తరలించారు.

jogulamba gadwal sp helps to pregnant woman, police humanity
పోలీసుల పెద్ద మనసు, గర్బిణీకి సాయం చేసిన పోలీసులు
author img

By

Published : May 25, 2021, 10:11 AM IST

జోగులాంబ గద్వాల జిల్లా గోనుపాడు గ్రామానికి చెందిన గర్భిణీ అంజలికి పోలీసులు ఆపన్నహస్తం అందించారు. పురిటి నొప్పులతో బాధపడుతూ తల్లి తాయమ్మతో కలిసి గద్వాలలోని ఓ ఆస్పత్రికి కాలినడకన వెళ్తున్న ఆమెకు సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. వారు ఆస్పత్రికి వెళ్లడానికి ఓ ఆటోలో రాగా.. లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించడాన్ని గమనించిన ఆటో డ్రైవర్ గర్భిణీని గాంధీచౌక్ పరిసర ప్రాంతంలోనే వదిలేశాడు.

పురిటి నొప్పులు భరిస్తూనే కాలినడకన ఆస్పత్రికి వెళ్తున్న అంజలిని పోలీసులు గమనించారు. ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో ఆమెను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మానవత దృక్పథంతో స్పందించిన ఎస్పీకి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదీ చదవండి: నదిలో మునిగిన నాటుపడవలు.. 8 మంది గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.