జోగులాంబ గద్వాల జిల్లాలోని జమ్మిచెడులో కొలువైన జములమ్మ... అత్యంత మహిమగలదని భక్తుల విశ్వాసం.
అమ్మను తలిచాకే పని మెుదలు
ఇక్కడ పొలాలు దున్నేటప్పుడు అమ్మవారిని కొలిచి వ్యవసాయం చేయడం ఆనవాయితీ. గృహప్రవేశం, పెళ్లిళ్ల సందర్భంలో ముందుగా జములమ్మను దర్శించుకున్నాకే శుభకార్యాలు జరుపుతారు. ఆలయ సమీపంలో గుడారాలు వేసుకొని అమ్మవారికి మాంసాహారంతో నైవేద్యం సమర్పిస్తారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు ఉమ్మడి జిల్లాతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హజరయ్యారని ఆలయ ఈ.ఓ పురేందర్ తెలిపారు.
కనిపించని వసతులు
ఏటా లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ జాతరకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. మరుగుదొడ్లు,స్నానాల గదులు, తాగునీటి వసతి సౌకర్యాల కల్పించలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.గత ఏడాది భక్తుల కోసం కృష్ణానదిలో మరబోటు ఉపయోగించారని, ఈ ఏడాది మాత్రం ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు నిరాశ చెందారు. దర్శనానికి వస్తున్న భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.
ఇవీచదవండి:వరుణుడి ఉగ్రరూపం