Karthika Pournami 2024 Special Recipe : మాసాలన్నింటిలోనూ పరమపావనమైన కార్తికమాసంలో వచ్చే పౌర్ణమికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. శివ-విష్ణువులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ కార్తిక పౌర్ణమిని శరత్ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది ఈ పవిత్రమైన రోజున ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు నిర్వహించడమే కాకుండా నైవేద్యాలు సమర్పిస్తుంటారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది చలిమిడి.
ముఖ్యంగా కార్తిక పౌర్ణమి రోజు మెజార్టీ పీపుల్ ప్రిపేర్ చేసుకునే నైవేద్యాలలో ఇది తప్పనిసరిగా ఉంటుంది. కానీ, కొందరికి ఎంత బాగా తయారుచేసుకున్నా పర్ఫెక్ట్ టేస్ట్‌తో రాదు! అలాంటి వారు ఈ కార్తిక పౌర్ణమి వేళ ఈ కొలతలను ఫాలో అవుతూ చలిమిడిని తయారు చేసుకోండి. రుచి అద్భుతంగా ఉంటుంది! ఇంతకీ, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- రైస్ - పాకానికి తగ్గట్లు నానబెట్టుకోవాలి
- అరకప్పు - కొబ్బరి
- రెండు టేబుల్ స్పూన్లు - చక్కెర
- పావుకిలో - బెల్లం
- రెండు టేబుల్ స్పూన్లు - నెయ్యి
- పిడికెడు - జీడిపప్పు
- పావుటీస్పూన్ - యాలకుల పొడి
తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా తడి బియ్యప్పిండిని రెడీ చేసుకోవాలి. ఇందుకోసం ముందు రోజు రాత్రి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. లేదంటే.. మార్నింగ్ లేవగానే బియ్యాన్ని నానబెట్టుకున్నా సరిపోతుంది.
- ఎందుకంటే.. కార్తిక పౌర్ణమి పూజను ఎక్కువగా సాయంత్రం సమయంలోనే చేసుకుంటారు. కాబట్టి ఉదయం బియ్యాన్ని నానబెట్టుకున్నా చాలు. బియ్యం ఎప్పుడు నానబెట్టుకున్నా కనీసం ఆరు గంటలు నానబెట్టుకుంటేనే చలిమిడి చక్కగా వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- బియ్యం చక్కగా నానిన తర్వాత వాటర్‌ని పూర్తిగా వడకట్టి తడి ఆరే వరకు కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు రెసిపీలోకి కావాల్సిన పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై మందపాటి కడాయి పెట్టుకొని బెల్లం తురుము, పంచదారతో పాటు తగినన్ని వాటర్ వేసుకొని బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించుకోవాలి.
- బెల్లం పూర్తిగా కరిగినప్పుడు పాకంలో నురగ వస్తుంది. ఆ టైమ్‌లో గరిటెతో కొద్దిగా పాకాన్ని తీసుకొని వాటర్‌లో వేసుకోవాలి. అప్పుడు అది గడ్డకడితే పాకం రెడీ అని అర్థం చేసుకోవాలి.
- ఇలా పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నాక.. అందులో యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఆపై మంటను లో ఫ్లేమ్‌కి టర్న్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి.
- పిండి ఉండలు లేకుండా పాకంలో పూర్తిగా కలిసేలా పెద్ద గరిటెతో కలుపుకోవాలి. మీరు ఎంత బాగా పిండిని కలుపుకుంటే చలిమిడి అంత రుచికరంగా వస్తుందని గుర్తుంచుకోవాలి. అయితే, కాస్త లూజ్‌గా ఉన్నప్పుడే పిండిని వేయడం ఆపేసి స్టౌ కూడా ఆఫ్ చేసుకోవాలి. అదే ఒకవేళ చలిమిడి ఎక్కువ జారుడుగా ఉంటే మరికొంచం తడి బియ్యప్పిండిని యాడ్ చేసుకోవాలి.
- వీలైనంత వరకు చలిమిడి కాస్త లూజ్‌గా ఉన్నప్పుడే దింపుకుంటే కొద్దిసేపటికి కాస్త గట్టి పడుతుంది. అదే లూజ్ లేకుండా పిండిని వేసుకుంటే చలిమిడి గట్టిగా అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక జీడిపప్పు పలుకులను వేసి వేయించుకోవాలి. అలాగే కాస్త ముదురుగా ఉండే పచ్చికొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయించుకోవాలి.
- ఇక చివరగా వీటిని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చలిమిడిలో వేసి కలుపుకుంటే చాలు. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే "చలిమిడి" రెడీ!
ఇవీ చదవండి :
ఆరోగ్యాన్నిచ్చే "ఓట్స్ పొంగల్" - చిటికెలో చేసుకోండిలా! - బరువు తగ్గాలనుకునేవారికి బెటర్ ఆప్షన్!
గుడిలోని ప్రసాదమంత టేస్టీ పులిహోర ఇంట్లోనే! - ఈ చిన్న టిప్స్ పాటిస్తే అద్భుత రుచిని అస్వాదిస్తారు!