Sanjay Manjrekar About Border Gavaskar Trophy : ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా మరికొద్ది రోజుల్లో భారత్ - ఆసీస్ మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ అట్టహాసంగా ప్రారంభంకానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆతిథ్య దేశానికి చేరుకున్న టీమ్ఇండియా ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఓ స్పెషల్ సెషన్లో టీమ్ఇండియా ఘోరంగా శ్రమిస్తోంది. దీనికి సంబంధించిన పలు వీడియోలు కూడా నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే గత కొంతకాలంగా నుంచి పేలవమైన ఫామ్‌తో ఉన్న రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ ఇప్పుడీ టెస్ట్‌లో తన బ్యాటింగ్ స్కిల్స్‌తో కంగారులను హడలెత్తించాలనుకుంటున్నాడు.
మరోవైపు విరాట్‌ను కట్టడి చేసేందుకు ఆసీస్ కూడా తెగ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కోహ్లీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌లో అతడి కోసం ఆస్ట్రేలియా ఎటువంటి ప్లాన్ వేస్తుందన్న విరాట్‌కి ముందే తెలుసని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
"ఆస్ట్రేలియా ప్లేయర్లు తన కోసం ఏం ప్లాన్ చేయనున్నారో విరాట్‌కు బాగా తెలుసు. ఆసీస్ బౌలర్లు కచ్చితంగా ప్రారంభంలో ఆఫ్ స్టంప్ బయట ఉన్న లైన్‌లో బౌలింగ్ చేసి బ్యాటర్ ఏ మూడ్‌లో ఉన్నాడో అంచనా వేస్తారు. అయితే సాధారణంగా కోహ్లీ ఆఫ్ స్టంప్ బయట వచ్చే బాల్స్‌ను వదిలివేయాలని చూస్తాడు. కానీ ఒకవేళ బంతి సరైన ప్రదేశంలో మాత్రం పడితే ఇక దాన్ని డ్రైవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇటీవలి కాలంలో బౌలర్లు కోహ్లీని ఇరుకున పెట్టడానికి అతని శరీరాన్ని లక్ష్యంగా చేసుకోని కొన్నిసార్లు బౌన్సర్లు కూడా వేస్తున్నారు. ఎందుకంటే విరాట్ ముందుకు వచ్చి ఆడటానికి బాగా ఇష్టపడతాడు. న్యూజిలాండ్ టీమ్ ఈ ట్రిక్‌ను ఉపయోగించుకునేందుకు బాగా ప్రయత్నించింది. చెప్పాలంటే ఇది చాలా తెలివైన పనే. కానీ, ఆస్ట్రేలియా బౌలర్లు తనపై ప్రయోగించాలనుకున్న ప్లాన్స్ గురించి విరాట్‌కు బాగా తెలుసు" అని మంజ్రేకర్ తాజాగా వివరించాడు.
చెట్లెక్కిన అభిమానం - విరాట్‌ను చూసేందుకు ఆస్ట్రేలియాలో ఫ్యాన్స్ స్టంట్స్!