IRCTC Magical Madhya Pradesh Tour : మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు సందర్శించాలనుకుంటున్నారా? అయితే, మీకోసం ఒక సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్సీటీసీ. తక్కువ ధరలో మధ్యప్రదేశ్ అందాలను కనులారా వీక్షించే గొప్ప అవకాశం కల్పిస్తోంది. ఇంతకీ, ఈ ప్యాకేజీ ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటుంది? ధర ఎంత? ఏ ఏ ప్రదేశాలు చూడొచ్చు? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) "మ్యాజికల్ మధ్యప్రదేశ్" పేరుతో ఈ టూర్‌ని ఆపరేట్ చేస్తోంది. ఇది మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా మధ్యప్రదేశ్ అందాలను చూసి రావొచ్చు.
టూర్ కొనసాగనుందిలా..
డే 1 : మొదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్లో 4 గంటల 40 నిమిషాలకు మీ టూర్ స్టార్ట్ అవుతుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్(ట్రైన్ నంబర్ 12707)లో ఓవర్ నైట్ జర్నీ కొనసాగుతుంది.
డే 2 : రెండో రోజు మార్నింగ్ 8 గంటల 15 నిమిషాలకు భోపాల్ రీచ్ అవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి హోటల్‌కు వెళ్తారు. హోటల్లో చెకిన్ అండ్ ఫ్రెషప్ తర్వాత సాంచికి బయలుదేరుతారు. సాంచి స్తూపాన్ని సందర్శిస్తారు. అనంతరం భోజేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరిగి భోపాల్ చేరుకుంటారు. ఈవెనింగ్ ట్రైబల్ మ్యూజియం విజిటింగ్ ఉంటుంది. ఆ రాత్రికి భోపాల్‌లోనే బస చేస్తారు.
డే 3 : మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ అనంతరం పచ్మార్హికి స్టార్ట్ అవుతారు. అక్కడ హోటల్లో చెకిన్ అయ్యాక.. ఫ్రీ టైమ్‌లో అక్కడి ప్రదేశాలు వీక్షించొచ్చు. ఆ తర్వాత ఆ రోజు రాత్రికి అదే హోటల్లో స్టే ఉంటుంది.
డే 4 : నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పాంచ్ పాండవ్ కేవ్స్, జట శంకర్ ఆలయాన్ని దర్శించుకుంటారు. అదేవిధంగా.. బీ ఫాల్స్, సన్‌సెట్ పాయింట్ వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. అనంతరం తిరిగి హోటల్‌కు చేరుకుని అక్కడే నైట్ స్టే చేస్తారు.
డే 5 : ఐదో రోజు మార్నింగ్ టిఫెన్ అనంతరం జబల్పూర్కి స్టార్ట్ అవుతారు. అక్కడ హోటల్లో చెకిన్ అయ్యాక.. మధ్యాహ్నం మార్బుల్ రాక్స్, ధుంధర్ జలపాతం విజిట్ చేస్తారు. ఆ తర్వాత జబల్పూర్ రైల్వే స్టేషన్‌కి బయలుదేరుతారు. అక్కడి నుంచి తెల్లవారు జామున 2 గంటలకు సికింద్రాబాద్‌కు రిటర్న్ జర్నీ మొదలవుతుంది.
డే 6 : ఆరో రోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుకోవడంతో మీ పర్యటన ముగుస్తుంది.
ప్యాకేజీ ధర వివరాలు చూస్తే :
1 నుంచి 3 గురు ప్యాసింజర్స్‌కు..
- కంఫర్ట్(3AC)లో ట్విన్ షేరింగ్‌కు రూ.24,150 చెల్లించాలి. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.18,440గా నిర్ణయించారు.
- 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.13,550, విత్ అవుట్ బెడ్ అయితే రూ.11,910 చెల్లించాలి.
- స్టాండర్డ్(SL)లో ట్విన్ షేరింగ్‌కు రూ.21,750 చెల్లించాలి. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.16,050గా నిర్ణయించారు.
- 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.11,150, విత్ అవుట్ బెడ్ అయితే రూ.9,510 చెల్లించాలి.
4 నుంచి 6 గురు ప్యాసింజర్స్‌కు..
- కంఫర్ట్(3AC)లో ట్విన్ షేరింగ్‌కు రూ. 20350 చెల్లించాలి. అదే ట్రిపుల్ షేరింగ్‌కు రూ.17,140 పే చేయాలి.
- స్టాండర్డ్(SL)లో ట్విన్ షేరింగ్‌కు రూ.17,950, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.14,740గా నిర్ణయించారు.
ఐఆర్సీటీసీ ఆపరేట్ చేస్తున్న ఈ టూర్ ప్రతి శుక్రవారం పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవీ చదవండి :
ఇయర్ ఎండ్ షిరిడీ టూర్ - తక్కువ ధరకే IRCTC అద్భుత ప్యాకేజీ!