ETV Bharat / state

పట్నం నరేందర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్, పోలీసుల కస్టడీ పిటిషన్ - రెండింటిపై సోమవారం విచారణ

ప్రభుత్వాధికారులపై దాడి కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన పట్నం నరేందర్ రెడ్డి - కోర్టుకు అఫిడవిట్‌ పంపిన పట్నం నరేందర్ రెడ్డి - పట్నం కస్టడీ కోసం పిటిషన్ వేసిన పోలీసులు

Patnam Narender Reddy Bail Petition
Patnam Narender Reddy Bail Petition (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 8 hours ago

Updated : 4 hours ago

Patnam Narender Reddy Bail Petition : వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వాధికారులపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు పట్నం నరేందర్ రెడ్డి సైతం తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది.

నరేందర్ రెడ్డిని కస్టడీకి కోరిన పోలీసులు : కలకలం సృష్టించిన లగచర్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి నిన్న రిమాండ్‌కు తరలించారు. ఏ2గా ఉన్న బోగమోని సురేష్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. అరెస్ట్ సమయంలో అతని ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నరేందర్ రెడ్డి : ఫోన్ కాల్ డేటాని విశ్లేషించేందుకు, నరేందర్ రెడ్డిని కేసుపై మరింత విచారిచేందుకు అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఆయనను ఏడు రోజుల కస్టడీకి కోరుతూ వికారాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వికారాబాద్ కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై కోర్టు సోమవారం విచారణ జరపనుంది.

ఏ ఒక్క పోలీసు అధికారి నా స్టేట్‌మెంట్ తీసుకోలేదు : ఇదిలా ఉండగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని న్యాయవాదులు కలిశారు. వారి ద్వారా కోర్టుకు నరేందర్ రెడ్డి అఫిడవిట్ పంపారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు. నిన్న ఉదయం కేబిఆర్‌ పార్కు వద్ద మార్నింగ్ వాక్ సమయంలో తనని పోలీసులు అరెస్ట్ చేశారని బలవంతంగా కారులో ఎక్కించి వికారాబాద్ డీటీసీకి తీసుకొచ్చారని అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు. ఏ ఒక్క పోలీసు అధికారి తన స్టేట్మెంట్ తీసుకోలేదని కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు పేపర్లపై తన సంతకం తీసుకున్నారన్నారని నరేందర్ రెడ్డి ఆరోపించారు.

హైకోర్టులో నరేందర్‌ రెడ్డి క్వాష్ పిటిషన్ : తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ లగచర్ల ఘటనలో ఏ1 నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయవాదుల ద్వారా ఆయన కోర్టుకు అఫిడవిట్‌ పంపించారు. ఈ కేసులో తన పేరుని ఏ1గా పెట్టారని నరేందర్ రెడ్డి అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

అరెస్ట్‌కు ముందు తనకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని కేటీఆర్ సహా ఇతరులు అదేశాలతో దాడులు చేసినట్లు ఫేక్ స్టోరీని పోలీసులు క్రియేట్ చేశారని అఫిడవిట్‌లో తెలిపారు. అసలు తాను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదన్న నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో వారు చెప్పినవన్ని నిజం కాదన్నారు. దయచేసి తన స్టేట్మెంట్‌ను పరిగణనలోకి తీసుకోని విచారణ చేయాలని అఫిడవిట్‌లో పట్నం నరేందర్ రెడ్డి కోర్టును కోరారు.

పట్నం నరేందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ - రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావన

కిడ్నాపర్లలా వచ్చి తీసుకెళ్లే దానిని అరెస్ట్ అంటారా : కేటీఆర్

Last Updated : 4 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.