జోగులాంబ గద్వాల జిల్లాలోని మున్సిపల్ కార్యాలయంలో రెండోరోజు నామినేషన్లు వేసేందుకు తెరాస, భాజపా, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. 22వ వార్డు నుంచి తెరాస పార్టీ తరపున చైర్మన్ అభ్యర్థిగా బీఎస్ కేశవ్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెరాస అభ్యర్థులు 37 స్థానాల్లోనూ గెలిచి, జిల్లాను క్లీన్‌స్వీప్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు తెరాస అందించిన గత పరిపాలనే తమకు మార్గం సుగమం చేస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి : సమస్యలకు నిలయాలు పాలమూరు మున్సిపాలిటీలు