జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలోకి లక్షా 53 వేల 400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా... ప్రాజెక్టు 19 గేట్లు ఎత్తి లక్షా 61 వేల 081 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా... ప్రస్తుతం 1043 అడుగులుగా ఉంది. జూరాల జలాశయం పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.670 టీఎంసీల నీటిని నిల్ప ఉంచారు.
ఇవీ చూడండి: భద్రాద్రి వాసుల్లో టెన్షన్.. భయపెడుతున్న ముంపు భయం!