ETV Bharat / state

జూరాలకు భారీగా వరద

ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 3 లక్షల 5 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.

భారీగా వరద
author img

By

Published : Aug 7, 2019, 10:13 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో భారీగా వరద నీరు చేరడం వల్ల జూరాల నిండుకుండను తలపిస్తోంది. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.330 టీఎంసీలు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా... ప్రస్తుతం 317.330 మీటర్లకు చేరింది. ప్రాజెక్టులోకి 3 లక్షల 5 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. దిగువన ఉన్న శ్రీశైలానికి 3 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల కుడి కాల్వ ద్వారా 750 క్యూసెక్కులు.. ఎడమ కాల్వ ద్వారా 781 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నారు.

ఇదీ చూడండి: ట్వీట్​తోనే పర్యటకుల సమస్యల పరిష్కారం

Intro:tg_mbnr_01_07_juralaku_Bhariga_varuda_av_ts10049
ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుండి జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుండి జూరాలకు 3 లక్షల 5 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టు లోకి వచ్చి చేరుతుంది.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని జూరాల ప్రాజెక్టుకు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరడంతో జూరాల నిండుకుండలను తలపిస్తుంది. ప్రస్తుతం జూరాల పూర్తి నిలువ.9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.330 టీఎంసీలు నిల్వ ఉంది . ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.330 నీరు నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టు లోకి 3 లక్ష 5 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, దిగువన ఉన్న శ్రీశైలానికి 3 లక్షా క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న ప్రాజెక్టు శ్రీశైలం కి విడుదల చేస్తున్నా అధికారులు. జూరాల కుడి 750 క్యూసెక్కులు జూరాల డమ కాలువలకు 781 క్యూసెక్కుల నీటిని , బీమా-1: 1300 క్యూసెక్కులు అదే విధంగా బీమా 2: 861 క్యూసెక్కులు నెట్టెంపాడు2200 క్యూసెక్కులు కోయిల్ సాగర్ 315 క్యూసెక్కులు పెరల్ కెనాల్ 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Body:babanna

Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.