జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. చవితి పర్వదినం సందర్భంగా పట్టణంలోని వీధులలో అందంగా అలంకరించిన మండపాలలో గణనాథులు కొలువుదీరారు. ఉదయం నుంచే భక్తులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా 500 మట్టి వినాయకులను ఇంటింటికి తిరిగి పంచారు. మట్టి గణనాథుల వల్ల కలిగే లాభాలను వివరించారు. మండల పరిషత్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజలు యూత్ సభ్యుల సేవను అభినందించారు.
అలంపూర్లో ఘనంగా వినాయక చవితి - జోగులాంబ గద్వాల
వినాయక చవితి పర్వదినం సందర్భంగా అలంపూర్లో అందంగా అలంకరించిన మండపాలలో గణనాథులు కొలువుదీరారు. ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.