జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో పట్టణ ప్రగతి నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో కల్పించే సౌకర్యాలు, వసతుల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు. పట్టణ ప్రగతిలో చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ కరుణ, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల