జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. పట్టణంలో దెబ్బతిన్న కాలనీలకు మున్సిపల్ ఛైర్మన్ బీఎస్ కేశవ్‌తో కలిసి... ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. నీరు నిల్వ ఉండకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో పట్టణంలో 82.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.
గద్వాల్-రాయచూర్ రహదారిపై నందిన్నె గ్రామం వద్ద తాత్కాలికంగా నిర్మించిన బ్రిడ్జి ధ్వంసమైంది. దీంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున... రాయచూర్ నుంచి వస్తున్న లారీ వాగులో పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
ఇదీ చూడండి: జూరాలకు కొనసాగుతున్న వరద... 19 గేట్లు ఎత్తివేత