ETV Bharat / state

'క్రీడాకారులకు నైపుణ్యం ఉన్నా... ఆదరణ కరువైంది'

క్రీడాకారులకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందండంలేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె. అరుణ వ్యాఖ్యానించారు. గద్వాల జిల్లాలో ఫుట్​బాల్​ టోర్నమెంట్​ను ఆమె ప్రారంభించారు.

football tournament starts at gadwal
'క్రీడాకారులకు నైపుణ్యం ఉన్నా... ఆదరణ కరువైంది'
author img

By

Published : Feb 18, 2021, 3:53 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా ఫుట్​బాల్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టోర్నమెంట్​ను భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె.అరుణ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ నేటి నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించనున్నారు. దాదాపు 18 జట్లు పాల్గొంటుండగా.. ప్రథమ బహుమతిగా లక్ష రూపాయల నగదును... ద్వితీయ బహుమతిగా యాభై వేలు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

రాష్ట్రంలో క్రీడాకారులకు నైపుణ్యం ఉన్నా... ఆదరణ కరువైందని డీకే అరుణ వ్యాఖ్యానించారు. సొంతంగా కష్టపడి క్రీడల్లో నైపుణ్యం పొందిన క్రీడాకారులను పిలిచి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప...ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో చిన్నారులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి: 'ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్‌'గా హైదరాబాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.