ETV Bharat / state

విద్యుదాఘాతంతో రైతు మృతి...

జోగులాంబ గద్వాల జిల్లా మల్లెందొడ్డిలో విద్యుదాఘాతంతో రైతు మృతిచెందాడు. లైన్​మెన్​ చేయాల్సిన పనిని రైతుతో చేయించాడని, ఆ సమయంతో విద్యుత్​ సరఫరా కావటంతో మృతిచెందాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి...
author img

By

Published : May 26, 2019, 11:37 PM IST

విద్యుదాఘాతంతో రైతు మృతి...

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్​ మండలం మల్లెందొడ్డిలో విద్యుదాఘాతంతో రైతు మృతిచెందాడు. విద్యుత్​ సరఫరాలో అంతరాయం రావటంతో అదే గ్రామానికి చెందిన నరసింహ లైన్​మెన్​ అనుమతితో సరిచేయడానికి ప్రయత్నించాడు. ఇంతలోనే ఒక్కసారిగా విద్యుత్​ సరఫరా కావడం వల్ల షాక్​ తగిలి అక్కడికక్కడే రైతు మృతిచెందాడు.

విద్యుత్​ లైన్లను లైన్​మెన్​ సరిచేయాల్సి ఉండగా, మరమ్మతు చేసేందుకు రైతును పంపించాడని, అంతలోనే విద్యుత్​ సరఫరా అయిందని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలంటూ సబ్​స్టేషన్​ ముందు గ్రామస్థులు ధర్నాకు దిగారు. వారికి బీఎల్​ఎఫ్​ నాయకులు రంజిత్​కుమార్​ మద్దతు ప్రకటించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారులు హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు.

ఇవీ చూడండి: భార్య, కుమారుడుని హత్య చేసి పరార్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.