ETV Bharat / state

రైతుబంధు డబ్బులు తన ఖాతాకు మళ్లించుకున్నాడు

రైతులకు చెందాల్సిన రైతుబంధు డబ్బులు ఓ అధికారి తన సొంత ఖాతాకు మళ్లించుకున్నాడు. ఇలా ఆరుగురు రైతుల నుంచి సుమారు 58 వేలకు పైగా దండుకున్నాడు. పరిశీలనలో వెలుగులోకి వచ్చిన అవినీతిపై అతనిని కలెక్టర్​ సస్పెండ్​ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదంతం గద్వాల జిల్లాలో జరిగింది.

farmer diverted the rythu bandhu money to his account at thummilla cluster gadwal
రైతుబంధు డబ్బులు తన ఖాతాకు మళ్లించుకున్నాడు
author img

By

Published : Jul 11, 2020, 6:44 PM IST

గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల క్లస్టర్‌ ఏఈవో ప్రకాశంను కలెక్టర్ శ్రుతి ఓజా సస్పెండ్ చేశారు. ఆరుగురు రైతులకు చెందిన రైతుబంధు డబ్బులు 58 వేల 852 రూపాయలు తన ఖాతాకు మళ్లించుకున్నారు. ఉన్నతాధికారుల విచారణలో అతని అవినీతి వెలుగులోకి వచ్చింది. విషయం జిల్లా కలెక్టర్​కు తెలుపగా ఆమె సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మండలానికి చెందిన ఆరు మంది రైతులు బతుకు తెరువు కోసం ఊరు వదిలి వెళ్లిపోయారు. ఇదే అదునుగా తీసుకుని సదరు రైతుల వివరాలు సేకరించిన విస్తరణాధికారి రైతుల బ్యాంకు ఖాతాకు బదులు తన సొంత ఖాతాను ఇచ్చాడు. వారికి అందాల్సిన రైతుబంధు డబ్బులు తన సొంత ఖాతాలోకి పంపుకుని చివరకు చిక్కాడు.

ఇదీ చూడండి : డొంక కదులుతోంది: సీఐ శంకరయ్య అవినీతి లీలలెన్నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.