AP HC Dismissed Petition Filed by Director Ram Gopal Varma : అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ (ఆర్జీవీ) అభ్యర్థనను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే, బెయిల్ పిటిషన్ వేసుకోవాలని తెలిపింది. ఈ క్రమంలోనే పోలీసుల విచారణకు మరికొంత సమయమివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దానికి స్పందించిన ఉన్నత న్యాయస్థానం, అభ్యర్థన పోలీసులు ముందు చేసుకోవాలని, కోర్టు ముందు కాదని పేర్కొంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా గతంలో రామ్గోపాల్ వర్మ పోస్టులు పెట్టారు. దీనిపై ఇటీవల మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
రామ్గోపాల్ వర్మకు షాక్ - ఆ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు - RAM GOPAL VARMA CASE UPDATE
ఏపీ హైకోర్టులో దర్శకుడు రామ్గోపాల్ వర్మకు చుక్కెదురు - అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం
Published : Nov 18, 2024, 12:26 PM IST