ETV Bharat / state

ఊరొళ్లకు అప్పులు లేకుండా చేసిన ఆవులు - 'పాడి' సంపదతో ఇంటింటా సిరులు

జర్మనీ మహిళ చేయూతతో ఊరి రూపరేఖలు మార్చుకున్న కుమ్మరిగూడెం - ఇంటికో ఆవు ఇక్కడి స్పెషల్

MILK PRODUCTION IN KUMMARIGUDEM
రైతుకు ఆవును అందిస్తున్న జర్మనీ దేశస్థురాలు మోనికా రెటరింగ్‌ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Kummarigudem Milk Production : హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల సమీపంలోని గ్రామం కుమ్మరిగూడెం. అక్కడ ఇంటింటికీ కనీసం ఒక్క ఆవు అయినా ఉంటుంది. వాకిట్లో అడుగు పెడితే చాలు కాగుతున్న పాల సువాసన మన ముక్కును తాకుతుంది. మరో రెండడుగులు ముందుకు వేస్తే నెయ్యి ఘుమఘుమలు మనసును హత్తుకుంటాయి. ఈ గ్రామంలోనూ పదేళ్ల కిందటి వరకు రైతులు సాధారణ వ్యవసాయం చేసేవారు. పెట్టుబడి తగ్గించుకుని మంచి ఆదాయం సాధించాలన్న లక్ష్యంతో స్థానిక రైతు మారుపాక కోటి సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టారు.

పాలేకర్‌ సాగు విధానంపై హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందారు. ఆయన ప్రతిభ, కృషిని ఆరేళ్ల కిందట హసన్‌పర్తి మండలంలోని మహర్షి గోశాల నిర్వాహకులు డాక్టర్‌ సర్జన రమేష్, కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు కూరపాటి వెంకటనారాయణ గుర్తించారు. రైతు ఆత్మహత్యల బాధిత కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు, జర్మనీ దేశస్థురాలైన మోనికా రెటరింగ్‌ను వీరు కలిశారు. కుమ్మరిగూడెం రైతులకు సహాయ సహకారాలు అందించాలని గౌరవంగా విన్నవించారు. దాంతో ఆమె 30 కుటుంబాలకు ఒక్కో ఆవును సమకూర్చారు.

గ్రామంలో ఉత్పత్తయిన పాలను సేకరించడానికి పాలకేంద్రం ఏర్పాటు చేయించారు. నెయ్యి తయారీ చేసే యంత్రాన్ని సమకూర్చారు. పాడి కారణంగా వారి ఆదాయం కొంత కొంత పెరగడంతో ఊరు ఊరంతా ఆవులను పెంచడం ప్రారంభించింది. ప్రస్తుతం ఇక్కడ 60 కుటుంబాలుండగా, 200 వరకు ఆవులున్నాయి.

KUMMARIGUDEM IN HANUMAKONDA
ఆవులతో కుమ్మరిగూడెం రైతులు (ETV Bharat)

స్వచ్ఛమైన నెయ్యి కిలో రూ.4 వేలు : స్థానిక రైతులు పాడి ఉత్పత్తి, విక్రయాలను పూర్తి సమష్టిగా కొనసాగిస్తున్నారు. పాల కేంద్రంలో నెయ్యి తయారీకి ప్రత్యేకంగా ఇద్దరిని నియమించారు. ప్రస్తుతం నెలకు 50 కిలోల నెయ్యి ఉత్పత్తి అవుతుండగా, అందులో 25 కిలోలు అమెరికా, లండన్, జర్మనీ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మిగతా నెయ్యి హనుమకొండ, వరంగల్, హైదరాబాద్‌లలోని ఆయుర్వేద వైద్యులకు విక్రయిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం కొనసాగించడం, నాణ్యతలో రాజీపడకపోవడంతో ప్రజలు వీరి ఉత్పత్తులపై అమితమైన ఆసక్తి చూపుతున్నారు. లీటర్ పాలు రూ.120, స్వచ్ఛమైన నెయ్యి కిలో రూ.4 వేలకు అమ్ముతున్నారు.

‘గతంలో వ్యవసాయం ద్వారా నెలకు రూ.3 వేల ఆదాయం వచ్చేది. ఆవుల పెంపకం తర్వాత నెలకు రూ.8 వేలు వస్తోంది. దీంతో మా ఆర్థిక ఇబ్బందులు తీరాయి. ఎలాంటి అప్పులు లేకుండా ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాం. మాలాగే ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా కుదురుకుంటున్నాయి.’ - రైతు మారుపాక కోటి

పనీర్‌ నీటితో లాభాలు బహు బాగు - ఇలా కూడా వాడొచ్చు తెలుసా? - Paneer Water Uses

అదుపుతప్పి పాల ట్యాంకర్ బోల్తా - బక్కెట్లు, బాటిళ్లతో ఎగబడ్డ స్థానికులు - Milk Van Accident In Nalgonda

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.