ETV Bharat / state

మూర్చతో బాధపడుతున్నారా? ఆందోళన చెందకండి - మందులు, శస్త్ర చికిత్సతో తగ్గించొచ్చట - EPILEPSY CENTER IN AIG HSOPITAL

హైదరాబాద్​ ఏఐజీ ఆసుపత్రిలో ఎపిలెప్సీ సెంటర్​ ప్రారంభం - ఆదివారం జాతీయ మూర్ఛ దినోత్సవం సందర్భంగా మొదలు

Epilepsy Center Started in AIG Hospitals
Epilepsy Center Started in AIG Hospitals (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2024, 12:35 PM IST

Epilepsy Center Started in AIG Hospitals : ఎపిలెప్సీ (మూర్ఛ వ్యాధి) అంటే ఆందోళన చెందకూడదని, మందులు, శస్త్ర చికిత్సతో తగ్గించవచ్చని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్​ డాక్టర్​ డి.నాగేశ్వర రెడ్డి తెలిపారు. ఆదివారం జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఏఐజీలో మూర్ఛ వ్యాధి రోగులకు అత్యాధునిక వసతులతో ప్రత్యేక కేంద్రాన్ని (ఏఐజీ సెంటర్​ ఫర్​ ఎపిలెప్సీ) ప్రారంభించారు. కంటిన్యూయింగ్​ మెడికల్ ఎడ్యుకేషన్​ (సీఎంఈ) కార్యక్రమాన్నీ చేపట్టారు. నాగేశ్వర రెడ్డి కార్యక్రంలో వర్చువల్​గా పాల్గొని ప్రసంగించారు.

ఈ కేంద్రం ద్వారా మూర్ఛ రుగ్మతకు ప్రపంచ స్థాయి చికిత్సను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. హాస్పిటల్ న్యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఎస్​ఐ జబీన్​, ఆసుపత్రి న్యూరోసర్జన్‌ సుబోధ్‌రాజు తదితరులు కార్యక్రమంలో మాట్లాడారు. ప్రారంభోత్సవానికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్​ అలీ ముర్తజా రిజ్వీ, బెంగళూరు ఎన్​ఐఎంహెచ్​ఏఎన్​ఎస్ డా. భాస్కర్​ రావు, చెన్నై గ్లోబల్​ ఆసుపత్రి డాక్టర్​ దినేష్​ నాయక్​, ఎయిమ్స్​ (దిల్లీ) వైద్యుడు రమేశ్​ దొడ్డమణి, ఏఐజీ హాస్పిటల్​ వైస్​ఛైర్మన్ వీపీఎస్​ రాజు, డైరెక్టర్ డాక్టర్​ జీవీ రావు, డా. రఘు, డా.ఎంకే మూర్తి తదితరులు పాల్గొన్నారు.

prevention of epilepsy day: తలకు గాయాలతో..మూర్ఛ ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.