జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో స్థానిక వ్యవసాయ మార్కెట్, పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో నిర్వహించిన హరితహారంలో కలెక్టర్ శశాంక, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఐదో విడత హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని.. అప్పుడే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ సరిత, అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: పోక్సో చట్టం సవరణలకు లోక్‌సభ ఆమోదం