జోగులాంబ గద్వాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి డీకే అరుణ హాజరయ్యారు. ఇటు రాష్ట్రంలో... అటు దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. దేశం మొత్తం భాజపా, నరేంద్ర మోడీ వైపే చూస్తోందని చెప్పుకొచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయే అవుతుందని... గ్రామాల్లో పార్టీని కార్యకర్తలే బలోపేతం చేయాలన్నారు.
ఇవీ చూడండి: