ETV Bharat / state

'రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి'

author img

By

Published : Apr 22, 2021, 8:30 PM IST

కొవిడ్​ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుంటే వైద్య, ఆరోగ్య పరిస్థితులపై ఒక్కసారైనా సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నించారు.

dk aruna comments on ktr, dk aruna latest news
'రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి'

కరోనా నియంత్రణలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం... తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం దురదృష్టకరమని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై తెరాస మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలు బట్టకాల్చి మీద వేసే చందంగా ఉన్నాయని దుయ్యబట్టారు.

సమీక్ష చేయకుండా

రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుంటే వైద్య, ఆరోగ్య పరిస్థితులపై ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేయకుండా... కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యమేనన్నారు. ఆక్సిజన్ అందరికీ అందుబాటులో ఉంచేందుకు మోదీ ప్రభుత్వం వారం క్రితమే చర్యలు మొదలు పెట్టిందని అన్నారు. పారిశ్రామిక ఆక్సిజన్ ఉత్పత్తిని నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఏం చర్యలు తీసుకున్నారు

దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆక్సిజన్ అందించేందుకు ప్రత్యేక ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్ ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. ఒక్కసారిగా డిమాండ్ పెరిగినప్పటికీ కొరత నివారించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఆక్సిజన్ కొరత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇంత వరకు రాష్ట్రంలో వ్యాక్సిన్​ల పంపిణీ, రెమ్​డెసివర్​ నిల్వలు, కరోనా టెస్టింగ్ కిట్లు, మెడికల్ ఆక్సిజన్లపై ఒక్కసారైనా సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నించారు.

ట్విట్టర్ పిట్ట కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకే 50 శాతం డోసులను రాష్ట్రాలకు, బహిరంగ మార్కెట్​కు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. వ్యాక్సిన్ ధర విషయంలో కేంద్రానికి సంబంధం లేదని, కావాలంటే కంపెనీలతో చర్చించి ధరను తగ్గించుకోవచ్చని హితవు పలికారు. వ్యాక్సిన్ ధరను కంపెనీలు నిర్ణయిస్తాయన్న కనీస ఇంగిత జ్ఞానం ట్విట్టర్ పిట్ట కేటీఆర్​కు లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో మంత్రులు, అధికారుల మధ్య సమన్వయమే లేదని ఆరోపించారు. ఒక మంత్రి సమృద్ధిగా నిల్వలున్నాయని అంటే మరొక మంత్రేమో కొరత ఉందంటారని ఎద్దేవా చేశారు. ప్రైవేటు ఆస్పత్రులు భారీ ఫీజులతో ప్రజల జేబులు గుల్ల చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం అందరం కలిసి పని చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం బంద్​ : ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.