ETV Bharat / state

'గిట్టుబాటు ధరలే లేవంటే... ఈ కమీషన్​ ఏజెంట్ల మోత ఒకటి' - గద్వాల మార్కెట్ యార్డులు

రైతులు పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతుంటే గద్వాల కూరగాయల మార్కెట్‌లో కమీషన్‌ ఏజెంట్లు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుంటే కమీషన్‌ ఏజెంట్లు మాత్రం వారి జేబులు నింపుకొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు కూరగాయలు తెచ్చిన రైతుల నుంచి కమీషన్‌ పేర ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు.

commision-agents-demanding-money-at-gadwal
'గిట్టుబాటు ధరలే లేవంటే... ఈ కమీషన్​ ఏజెంట్ల మోత ఒకటి'
author img

By

Published : Apr 23, 2021, 12:29 PM IST

గద్వాల కూరగాయాల మార్కెట్​లో కమీషన్ ఏజెంట్లు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నదాతల కష్టాలు పట్టని కమీషన్‌ ఏజెంట్లు ఉల్లిగడ్డకు రూ.10, ఇతర కూరగాయలకైతే రూ.8 వసూలు చేస్తున్నారు. టమాట బాక్స్‌ ధర రూ.100 అమ్ముడవుతోంది. అదే మూడు నాలుగు రోజుల కిందట బాక్స్‌కు రూ.50లకు మించి ధర రాలేదు. బెండకాయ రూ.30, ఉల్లి క్వింటా రూ.400 నుంచి రూ.800 వరకు ధర పలుకుతుంది. పంటను పొలం నుంచి మార్కెట్‌కు తీసుకొస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏడాది కిందట నల్లకుంటలోని మున్సిపల్‌ స్థలంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీకి రూపేణా డబ్బులు చెల్లించేవారు. కానీ 2020 మార్చి నెలలో కరోనా సమయంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డు స్థలంలో కూరగాయల మార్కెట్‌ నిర్వహణ కొనసాగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు మున్సిపల్‌ అధికారులకుగానీ ఇటు వ్యవసాయ మార్కెట్‌ అధికారులకుగానీ చిల్లిగవ్వ చెల్లించడం లేదు.

నిబంధనలు ఇలా...

మార్కెట్‌ నిబంధనల ప్రకారం రూ.100కు రూ.4 వసూలు చేయాల్సి ఉంది. ఇందులో మార్కెట్‌ సెస్‌కు రూ.100కు రూ.1, ఇందులోనే హమాలీలకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఏడాదిగా మార్కెట్‌కు ఒక్క రూపాయి చెల్లించిన దాఖలాలు లేవు. మార్కెట్‌ యార్డు అధికారుల నియంత్రణ లేకపోవడంతో కూరగాయల కమీషన్‌ ఏజెంట్లు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారు. ఇదేమని అధికారులను అడిగితే మార్కెట్‌ నుంచి లైసెన్సులు తీసుకుంటేనే మా పరిధిలోకి వస్తుందనే సమాధానం వస్తుంది. మార్కెట్‌ యార్డులో నిర్వహిస్తున్నందుకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు కమీషన్‌ ఏజెంట్లు చెబుతున్నారు. కానీ ఎవరికి ఇస్తున్న విషయాన్ని బహిర్గతం చేయడం లేదు.

దీనంగా రైతుల పరిస్థితి

మూడు ఎకరాల్లో టమాట సాగు చేస్తే... రోజుకు 60 నుంచి 70 బాక్స్‌ల వరకు దిగుబడి వస్తుందని గద్వాల రైతు శ్రీనివాసులు తెలిపారు. కూలీలకు ఒక్కొక్కరికి రూ.200 చెల్లిస్తు న్నామని... పొలం నుంచి మార్కెట్‌కు తీసుకురావడానికి ఆటోకు రూ.1,500 చెల్లిస్తున్నామని వెల్లడించారు. కానీ మార్కెట్‌లో ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయని వాపోయారు. ఒక్కో బాక్స్‌ రూ.100లకు మించడం లేదు. మార్కెట్‌ కమీషన్‌దారులు మాత్రం రూ.100కు రూ.8 వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మార్కెట్‌ ఫీజు వసూలు చేయడం లేదు

కూరగాయల మార్కెట్‌ను గతేడాది నుంచి మార్కెట్‌ యార్డు పరిధిలోనే కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మార్కెట్‌కు ఫీజు కట్టమని అడగలేదు. కమీషన్‌ ఏజెంట్లు కట్టలేదు. మార్కెట్‌ నుంచి లైసెన్సులు పొందితేనే మార్కెట్‌ ఫీజు అడిగే అవకాశం ఉంటుంది. అంతవరకూ మా పరిధిలోకి రాదు. లైసెన్సుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. త్వరలో ఇచ్చే ప్రయత్నం చేస్తాం.

- నర్సింహా, ప్రథమ శ్రేణి కార్యదర్శి, గద్వాల

కమీషన్‌ తీసుకుంటున్నారు

మార్కెట్‌కు 10 సంచుల ఉల్లిగడ్డలు తీసుకొచ్ఛా ఒక్కో సంచి రూ.350 అమ్ముడయింది. మొత్తం రూ.3,500 వచ్చింది. ఇందులో 10 శాతం కమీషన్‌ తీసుకొని మిగతా డబ్బులు ఇచ్చారు. ఎకరం ఉల్లిగడ్డ పండించడానికి దాదాపు రూ.30 వేల దాకా ఖర్చు అయ్యింది. దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. గిట్టుబాటు ధరలు కూడా లభించలేదు. కమీషన్‌ మాత్రం యథావిధిగా తీసుకుంటున్నారు.

- శాంతన్న, రైతు, వీరాపురం

ఇదీ చూడండి: యువతపై కరోనా పంజా.. రెండో దశలో 43 శాతం కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.