జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గత వారం నుంచి నకిలీ విత్తనాలు విక్రయంచే వారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. రైతులను మోసం చేసేందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తే వారిపై కేసు నమోదు చేస్తామని ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ హెచ్చరించారు. జిల్లాలో ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి 18 కేసుల్లో 9,900 కిలోల విత్తనాలు పట్టుబడగా 16 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.
గతేడాది కూడా 34 కేసుల్లో 3,600 కిలోల విత్తనాలు పట్టుపడగా 54 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. గతేడాది నమోదైన కేసులను పరిగణలోకి తీసుకుని నకిలీ విత్తనాల విక్రయిస్తున్నవారిపై పీడీ యాక్టు కింద కేసుల నమోదుకు నివేదికలు కూడా పంపడం జరిగిందని ఎస్పీ చెప్పారు.
ఇదీ చదవండి: Software Engineer: కొలువు వదిలేసి.. పొలం బాటపట్టి!