ETV Bharat / state

Bandi Sanjay: 'గంటసేపు కూడా ధర్నా చేయలేని అసమర్థుడు కేసీఆర్' - telangana news

Bandi Sanjay: ధాన్యం కొనేది కేంద్రమేనని ప్రజలకు రైతులకు అర్థమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ స్పష్టం చేశారు. కేంద్రానికి ఇస్తానని చెప్పిన ఉప్పుడు బియ్యం ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆయన అన్నారు. రైతుల కోసం దిల్లీలో గంట సేపు కూడా కేసీఆర్​ దీక్ష చేయలేకపోయారని సంజయ్​ విమర్శించారు.

Bandi Sanjay: 'గంటసేపు కూడా ధర్నా చేయలేని అసమర్థుడు కేసీఆర్'

author img

By

Published : Apr 16, 2022, 7:13 PM IST

Bandi Sanjay: తెరాస పాలనలో ఉద్యోగులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. కేసీఆర్ నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారన్న ఆయన.. ఇప్పుడు రైతుల వెంబడి పడుతున్నారని విమర్శించారు. కేంద్రానికి ఇస్తానని చెప్పిన ఉప్పుడు బియ్యం ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆయన అన్నారు. ఫిబ్రవరి 25న రాష్ట్రాలతో కేంద్రం నిర్వహించిన సమావేశంలో ధాన్యం ఇవ్వమని తెలంగాణ చెప్పిందని బండి సంజయ్​ ఆరోపించారు. అలా చెప్పిన వాళ్లే మళ్లీ దిల్లీకి వెళ్లి ధర్నా చేశారన్నారు.

రైతులకు అర్థమైంది.. ధాన్యం కొనేది కేంద్రమేనని ప్రజలకు రైతులకు అర్థమైందని సంజయ్​ స్పష్టం చేశారు. రైతుల కోసం దిల్లీలో గంట సేపు కూడా దీక్ష చేయలేకపోయారని ఆయన తెలిపారు. రూ.1960కి తక్కువగా ఎవరు ధాన్యం అమ్ముకున్నారో వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కేసీఆర్​ను నమ్మి వరి వేయకుండా నష్టపోయిన రైతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని చెప్పి.. ఏప్రిల్ 13న మళ్లీ కేంద్రానికి లేఖ రాశారని బండి సంజయ్​ వెల్లడించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని అదే లేఖ ముందే రాయమని భాజపా మొత్తుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పి మళ్లీ కేంద్రానికి ఎందుకు లేఖ రాశారని ఆయన ప్రశ్నించారు.

అదే నిదర్శనం.. ఇదే లేఖ కేంద్రానికి ఇంతకు ముందే ఎందుకు రాయలేదన్నారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాశారన్న బండి సంజయ్​.. కేసీఆర్ మూర్ఖత్వ అహంకార అనాలోచిత ధోరణికి లేఖనే నిదర్శనమన్నారు. రైతుల పట్ల కేసీఆర్ వైఖరికి కూడా ఆ లేఖనే నిదర్శనమని బండి సంజయ్​ విమర్శలు గుప్పించారు.

రైతులను ఆదుకోవాలి.. సీఎం కేసీఆర్ రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు సహా అందరిని ఇబ్బంది పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. వడ్ల కొనుగోలు డ్రామాలాడి రైతులను అరిగోస పెట్టిండు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి లేఖ రాసింది కేసీఆర్... మెడ మీద కత్తి పెడితే రాసిచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నాడు.ఇంతవరకు 2020-21 సంవత్సరానికి ఇవ్వాల్సిన 9 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇయ్యలేదు. ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రతిరోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ జనాన్ని పీడిస్తుండు. రైతుల కోసం గంటసేపు కూడా ధర్నా చేయలేని అసమర్థుడు కేసీఆర్. కేసీఆర్ లాంటి సీఎంను దేశ చరిత్రలో ఎవ్వరిని చూడలేదు. లేని సమస్యను సృష్టించి రాజకీయం చేయాలనుకుంటడు. వడ్ల కొనుగోలు వ్యవహారమే దీనికి సాక్ష్యం. -బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.