Bandi sanjay Padayatra: ప్రధాని నరేంద్ర మోదీ రోజు 18 గంటలు పనిచేసి 4 గంటలు నిద్రపోతే.. సీఎం కేసీఆర్ కనీసం 4 గంటలు కూడా పనిచేయరని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఉదండపురం నుంచి ఆరో రోజు యాత్ర ప్రారంభించిన బండిసంజయ్.. పాలమూరు ప్రజల కష్టాలను కేసీఆర్‌కు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తెరాస శ్రేణులు ప్రజాసంగ్రామ యాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని... సంజయ్ ప్రశ్నించారు. నిన్న(ఏప్రిల్ 18) ప్రజాసంగ్రామ యాత్రను తెరాస శ్రేణులు అడ్డుకున్న నేపథ్యంలో... పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్కూర్, నెడిపల్లి స్టేజ్, చెర్లగార్లపాడు స్టేజ్ మీదుగా.. ఎద్దులగూడెం వరకు 13 కిలో మీటర్ల మేర.. యాత్ర కొనసాగనుంది.
"రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు స్థాపించారో, ఎన్ని ఉద్యోగాలిచ్చారో స్పష్టం చేస్తే.. కేసీఆర్‌కు వందనం చేస్తా.. తప్పులు చెబితే బడిత పూజ చేస్తాం. పాలమూరు కరవును, వలసల్ని ప్రత్యక్షంగా చూస్తుంటే గుండె తరుక్కు పోతుంది. సరైన సమయంలోనే నేను పాదయాత్ర చేస్తున్నా. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే ఈ యాత్ర చేపట్టాను. తుంగభద్ర, కృష్ణానది నడుమ ఉన్న నడిగడ్డపై వెయ్యికోట్లు ఖర్చుపెడితే.. నెట్టెంపాడు, ఆర్డీఎస్ పనులు పూర్తై ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ఫాంహౌజ్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నుంచి సాగునీళ్లు తెచ్చుకున్న కేసీయార్.. నడిగడ్డ ప్రజలకు నీరిచ్చేందుకు ఎందుకు మనసు రావడం లేదో.. ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన సహా పలు పథకాలు కేంద్రం పేదవారి కోసం అమలు చేస్తుంటే.. మోదీకి పేరొస్తుందన్న అక్కసుతో రాష్ట్రంలో అమలు చేయడం లేదు. కేంద్రం ఇచ్చే నిధుల్ని వాడుకుంటూ తెరాస లబ్ది పొందే ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్ అవినీతి, అరాచక పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావాలి." - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చూడండి: