ETV Bharat / state

యాచకులను, ఆనాథలను ఆదుకున్న ఏఎస్సై

ఓ వైపు కరోనా.. మరోవైపు వలస కూలీల ఆవేదన.. మరికొన్ని ప్రాంతాల్లో యాచకులు, అనాథలకు భోజనం లేక అల్లాడుతున్నారు. అది చూసిన ఓ ఏఎస్సై సొంత ఖర్చులతో 30 మందికి ఆహారం ప్యాకెట్లు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.

ASI supplicates beggars and orphans in gadwal
యాచకులను, ఆనాథలను ఆదుకున్న ఏఎస్సై
author img

By

Published : Apr 4, 2020, 7:18 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో ఏఎస్సై సూర్య ప్రకాష్ మానవత్వాన్ని చాటుకున్నారు. రోజు కాగితాలు అమ్ముకుని జీవనం సాగించే నిరుపేదలకు సొంత డబ్బులతో సాయం చేశారు.

లాక్​డౌన్ నేపథ్యంలో ఆకలితో ఉన్న యాచకులను, అనాథలను మానవత్వంతో పోలీసు సిబ్బంది ఆదుకోవాలని జిల్లా ఇంఛార్జ్​ ఎస్పీ కె. అపూర్వ రావు సూచించారు. వారి సూచన మేరకు ఏఎస్సై సూర్య ప్రకాష్ గద్వాల్ పట్టణంలోని గూడులేని 30 మందికి సొంత ఖర్చులతో ఆహారాన్ని అందించారు.

ఇదీ చూడండి : మాయదారి మనిషిని నేను అంటున్న ఎస్పీ బాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.