ETV Bharat / state

అలంపూర్​లో కొనుక్కెళ్లి కర్నూల్​లో అమ్ముతాడంటా...! - liquor rates in ap

మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నా.... అక్రమార్కులు బెదరటంలేదు. తెలంగాణలో తక్కువ ధరకే మద్యం కొనుగోలు చేసి... ఆంధ్రప్రదేశ్​లో ఎక్కువ రేటుకు అమ్ముకునేందుకు తరలిస్తున్న ఓ వాహనాన్ని జోగులాంబ జిల్లా అలంపూర్​ పోలీసులు సీజ్​ చేశారు.

alampur police arrested illegal liquor transporter
అలంపూర్​లో కొనుక్కెళ్లి కర్నూల్​లో అమ్ముతాడంటా...!
author img

By

Published : May 13, 2020, 7:40 PM IST

Updated : May 14, 2020, 9:31 AM IST

అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనాన్ని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పోలీసులు సీజ్ చేశారు.​ ర్యాలంపాడు గ్రామ సమీపంలోని బ్రిడ్జి మీద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కర్నూలు పట్టణం నంద్యాల చెక్ పోస్ట్ ప్రాంతానికి చెందిన క్రాంతి కుమార్ తన కారులో మద్యం బాటిళ్లను తీసుకొని వెళుతుండగా పోలీసులు గుర్తించారు.

అదుపులోకి తీసుకుని విచారించగా అలంపూర్ ప్రాంతంలో తక్కువ రేటుకే మద్యం దొరుకుతోందని... ఇక్కడ కొనుగోలు చేసి కర్నూలులో విక్రయించేందుకు తరలిస్తున్నట్లుగా తెలిపాడు. కారులో ఉన్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్​ చేశారు. మద్యం బాటిళ్ల విలువ సుమారు రూ. 27 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

alampur police arrested illegal liquor transporter
అలంపూర్​లో కొనుక్కెళ్లి కర్నూల్​లో అమ్ముతాడంటా...!

ఇదీ చూడండి: కరోనా పంజా: 24 గంటల్లో 122 మరణాలు, 3525 కేసులు

Last Updated : May 14, 2020, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.