ఆర్డీఎస్ (రాజోలిబండ మళ్లింపు పథకం) వద్ద ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా కుడి కాలువ నిర్మిస్తోంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఆరోపించారు. గద్వాల జిల్లాలోని ఐజ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ విషయమై మూడు నెలలుగా వివిధ స్థాయిల్లోని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్కచుక్క నీటిని కూడా వదులుకోమని శాసనసభలో గంభీరంగా చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడంలేదని సంపత్ కుమార్ ప్రశ్నించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగిత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. లాక్డౌన్ కారణంగా రాష్ట్ర సరిహద్దుల వద్ద అమలవుతున్న ఆంక్షల కారణంగా చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. స్థానికులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి అనుమతివ్వాలని గద్వాల ఎస్పీని ఫోన్లో కోరారు.
ఇదీ చదవండి: Harish Rao: 'ఈ నెల 20న సిద్దిపేటకు సీఎం కేసీఆర్'