ETV Bharat / state

వీడు మామూలు దొంగ కాదు.. పోలీస్ జీపులోనే పరార్! - A THIEF CAUGHT BY POLICE AND ESCAPED IN POLICE JEEP

ఓ వ్యక్తి దొంగతనానికి యత్నించాడు. ఈ క్రమంలో జనానికి అడ్డంగా దొరికిపోయాడు. పోలీసుల చేతిలో పడ్డాడు. రెండురోజులు ఠాణాలో ఉన్న ఆ దొంగ... పోలీసుల కళ్లుగప్పి ఏకంగా వారి వాహనంలోనే పరారయ్యాడు. సినిమాల్లో మాత్రమే చూసే ఇలాంటి సన్నివేశం జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది.

A THIEF CAUGHT BY POLICE AND ESCAPED IN POLICE JEEP
author img

By

Published : Sep 20, 2019, 1:01 PM IST

Updated : Sep 20, 2019, 1:21 PM IST

జోగులాంబ గద్వాలలోని అలంపూర్​ చౌరస్తాలోని ఓ ఇంట్లో ఈ నెల 16న ఓ దొంగ చోరీకి ప్రయత్నించాడు. పక్కింటివాళ్లు ఇది గమనించి చాకచక్యంగా ఆలోచించారు. దుండగుడు దూరిన ఇంటికి బయటి నుంచి తాళం వేశారు. కానీ వెనుకవైపు ఉన్న తలుపు నుంచి బయటపడిన దొంగ చెట్టెక్కగా.... స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రెండు రోజులు పోలీస్​స్టేషన్​లోనే ఉన్నాడు. గురువారం తెల్లవారుజామున కానిస్టేబుళ్లు నిద్రలో ఉండడాన్ని గమనించి తెలివిగా తప్పించుకున్నాడు. అది కూడా పోలీసు వాహనంలోనే పరారయ్యాడు. ఆ వాహనాన్ని తక్షశిల వద్ద వదిలివెళ్లాడు. ఆ దొంగ వాహనాల చోరీలో ఆరితేరినవాడని... హైదరాబాద్​లో మెకానిక్​ షెడ్డు నిర్వహిస్తున్నాడని సమాచారం.

దొరికినట్టే దొరికి... పోలీసు జీపులోనే పరారయ్యాడు!

ఇదీ చూడండి: రహస్యంగా 'చిత్రీకరించారు'.. వేధించారు.. 'స్పందన'తో చిక్కారు!!

Intro:Body:Conclusion:
Last Updated : Sep 20, 2019, 1:21 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.