ETV Bharat / state

కాలం చెల్లిన మిరప విత్తనాలు పట్టుకున్న అధికారులు - తెలంగాణ వార్తలు

కాలం చెల్లిన మిరప విత్తనాలను పట్టుకున్న ఘటన జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండలో జరిగింది. 2,94,450 రూపాయల విలువైన విత్తనాలను సీజ్​ చేశారు.

కాలం చెల్లిన మిరప విత్తనాలు పట్టుకున్న అధికారులు

author img

By

Published : Jun 12, 2021, 10:41 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పలు విత్తనాల షాపుల్లో అగ్రికల్చర్​, విజిలెన్స్ ఎన్ఫోర్స్​మెంట్ అధికారులు తనిఖీ చేశారు. ఎస్.ఎస్.అగ్రిమాల్​ షాపులో కాలం చెల్లిన మిరప విత్తనాలను మండల వ్యవసాయ అధికారి వాసుదేవారెడ్డి ఆధ్వర్యంలో పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.2,94,450 వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

సీజ్ చేసిన విత్తనాలను స్థానిక పోలీస్ స్టేషన్​లో అందజేసి, డీలర్​పై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్సైకి నివేదించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ రాజు, ఏవో శ్రీనివాస్, చిట్యాల సీఐ పులి వెంకట్, స్థానిక రేగొండ ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్, ఏఈవో గోవర్ధన్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రెండోరోజు బిజీబిజీగా గడిపిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.